గుజరాత్ ప్రభుత్వం ఇటీవల ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బిల్కిస్ బానో అత్యాచార కేసు దోషులను సత్ప్రవర్తన కారణంగా విడుదల చేసింది. అయితే.. దీనిపై తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ.. బిల్కిస్ బానో అత్యాచార కేసు దోషుల విడుదల చేసిన వ్యవహారంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలన్నారు. దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్త్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. రేపిస్టులకు స్వాగతం చెప్పడం సమాజానికి చెంపపెట్టు అని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో వరుస ట్వీట్లు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇలాంటి పరంపర సాగడం మొదలుకాక ముందే ఈ ప్రమాదపు సంప్రదాయాన్ని ఆపాల్సిన అవసరం ఉందని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. రేపిస్టులు, హత్య చేసిన వారు జైలు నుంచి విడుదలైన తర్వాత ఒక సిద్దాంతాన్ని పాటించే వారు.. వారికి స్వాగతం చెప్పడం సమాజానికి చెంపపెట్టు అని అన్నారు ఎమ్మెల్సీ కవిత. రెమిషన్ విధానం కింద 2002, ఆగస్టు 15 నాటి బిల్కీస్ బానో అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.
జైలు నుంచి బయటకు వచ్చిన ఖైదీలకు ఒక సంస్థకు చెందిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు మిఠాయిలు తినిపిస్తూ పూలదండలతో స్వాగతం చెప్పినట్లు వార్తలు వచ్చాయి ఎమ్మెల్సీ కవిత. అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన నేరాలు చేసిన వారిని పవిత్రమైన స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విడుదల చేయడం ఆ రోజుకు ఉండే పవిత్రతకు కళంకం అని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. రేపిస్టులు, జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని క్షమించరాదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ దోషులను విడుదల చేయడం సరికాదన్నారు ఎమ్మెల్సీ కవిత. నెలల గర్భిణీని రేప్ చేయడం, ఆమె మూడేళ్ల చిన్నారిని హత్య చేసిన రేపిస్టులను విడుదల చేసి గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వం సున్నితత్వం లేని తనాన్ని ప్రదర్శించిందని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. ఇది చట్ట విరుద్ధమే కాకుండా మానవత్వానికి కూడా వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఒక మహిళగా బిల్కీస్ బానో అనుభవించిన బాధను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.