మూసీ పరివాహక ప్రాంతాల్లో నీళ్లు, పాలు, కూరగాయలు ఇలా అన్ని కలుషితమవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ధర్మారెడ్డి గూడెంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జెండా, అజెండా పక్కన పెట్టి మూసీ ప్రాంత అభివృద్ధికి కృషి చేయండి. మూసీ అణుబాంబు కంటే ప్రమాదకరంగా మారబోతుంది. మూసీ నీరు విషంగా మారింది. బీఆర్ఎస్ వాళ్లను పిలిచి నల్గొండ బాగుపడాలా..? వద్దా అని అడిగండి.
మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల కష్టాలను తీర్చడానికే సంగెం శివయ్యను దర్శించుకున్నా.. నా జన్మదినం నాడు దర్శించుకోవడం జన్మ ధన్యం అయింది. బీఆర్ఎస్ కు ప్రజలను దోచుకోవడమే తెలుసు అన్నారు. గంగా ప్రక్షాళన చేస్తే.. పొగుడుతున్న వాళ్లు.. మూసీ ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు విమర్శిస్తారు. ఎవ్వరూ అడ్డొచ్చిన మూసీ ప్రక్షాళన చేసి తీరుతానని పేర్కొన్నారు. బుల్డోజర్లు ఎక్కించి మరీ ప్రాజెక్టు చేపడుతామని పేర్కొన్నారు. బాధితుల రైతుల బాధలు స్వయంగా తెలుసుకున్నానని తెలిపారు. ఇక్కడ గేదె, ఆవు పాలను కొనాల్సిన పరిస్థితి లేదన్నారు.