గణేష్ శోభాయాత్ర నిమజ్జనానికి సర్వం సిద్ధం చేశారు హైదరాబాద్ పోలీసులు. 30 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు నేపథ్యంలో గణేష్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. విధుల్లో 3200 మంది ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. 20,000 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది విధులు నిర్వహిస్తారు.

1000 సీసీ కెమెరాలతో కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో పాటు హై రేస్ సీసీ కెమెరాలతో భద్రత పర్యవేక్షణ చేయనున్నారు. మహిళల భద్రత కోసం పెద్ద సంఖ్యలో మఫ్టీలో షీ టీమ్స్ ఉంటారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 12 వేల గణేష్ విగ్రహాలకు క్యూఆర్ కోడ్, జియో ట్యాగింగ్ కేటాయించారు పోలీసులు. శోభాయాత్రలో 10 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.