ఈవీఎంలను ఓటిపి ద్వారా హ్యాక్ చేయలేము :వందనా సూర్యవంశీ

-

ముంబయిలో ఈవీఎం హ్యాకింగ్‌పై వచ్చిన ఆరోపణలను రిటర్నింగ్ అధికారిణి వందనా సూర్యవంశీ ఖండించారు. ముంబై నార్త్ వెస్ట్ స్థానంలో ఎంపీగా గెలిచిన షిండే వర్గం శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ బంధువు కౌంటింగ్ సెంటర్‌లోకి మొబైల్ ఫోన్‌ తీసుకెళ్లారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఈవీఎంను హ్యాక్‌ చేశారన్న వార్తా కథనంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

ఓటీపీతో ఈవీఎంను తెరిచి పోలైన ఓట్ల సంఖ్యను ఆయన మార్పు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కమ్యూనికేషన్ కోసం ఎటువంటి సదుపాయం లేని ఫూల్‌ప్రూఫ్ టెక్నికల్ పరికరం ఈవీఎం అని ఆమె తెలిపారు. ఈవీఎం తెరిచేందుకు మొబైల్‌ ఫోన్‌, ఓటీపీ అవసరం లేదని అన్నారు.

రిటర్నింగ్ అధికారిణి వందనా సూర్యవంశీ ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎం వైర్‌లెస్ లేదా వైరు కమ్యూనికేషన్‌ పరికరం కాదు. అన్‌లాక్ చేయడానికి మొబైల్ ఫోన్‌ అవసరం లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్కు ఓటీపీ అవసరం లేదు. ఒక బటన్‌ నొక్కడం ద్వారా ఫలితాలు వస్తాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news