రైతులకు అదిరిపోయే శుభవార్త అందించింది కేంద్ర సర్కార్. రేపు ‘పీఎం కిసాన్’ డబ్బులు జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను రైతుల అకౌంట్లోకి జమ చేసేందుకు తేదీని ఖరారు చేశారు. రేపు ప్రధాని మోడీ 17వ విడత సమ్మాన్ నిధి విడుదల కానుంది.
ప్రధాని మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి రేపు….. నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా రైతుల ఖాతాలో నగదు జమ అవుతుంది. లక్షలాదిమంది రైతులకు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రైతులకు అందిస్తోంది.
ప్రస్తుతం ఖరీఫ్ సమయం ప్రారంభం కావడంతో రైతుల పెట్టుబడికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 43.52 లక్షల మంది అర్హులకు.. ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున సాయం అందనుంది. ఈ మేరకు ఏపీకి రూ.870 కోట్లు జమ చేయనున్నారు ప్రధానమంత్రి మోదీ.