షాకింగ్ : బెంగాల్ లీడర్ ఇంట్లో ఈవీఎం మెషీన్

-

రాజకీయ నాయకుడి ఇంట్లో ఈవీఎంలు మరియు వీవీపాట్ యంత్రాలు దొరికిన నేపధ్యంలో బెంగాల్ లోని హౌరా జిల్లాలోని ఉలుబెరియా వద్ద ఒక సెక్టార్ అధికారిని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. ఇప్పటికే సెక్టార్ అధికారిని సస్పెండ్ చేసామని స్వాధీనం చేసుకున్న ఈవీఎంలు, వీవీపీఏటీ యంత్రాలను రిజర్వ్‌ గా ఉంచామని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటన తరువాత, యంత్రాలను పోల్ ప్రక్రియ నుండి ఉపసంహరించుకున్నామని వాటి స్థానంలో కొత్తవి తెప్పించామని అన్నారు.

దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం ఇచ్చామని, ఈ ఘటనలో పోలీసు సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ”అని పోల్ ప్యానెల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బెంగాల్ లోని హౌరా, హూగ్లీ, సౌత్ 24 పరగణాలతో సహా మూడు జిల్లాల్లోని 31 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది. ఒక సీనియర్ పోల్ అధికారి అందించిన వివరాల ప్రకారం, సెక్టార్ ఆఫీసర్ యంత్రాలతో పాటు తన బంధువు అయిన నాయకుడి ఇంట్లో రాత్రంతా గడిపాడు. ఉదయాన్నే అందులో ఒక యంత్రాన్ని అక్కడే మరిచిపోయాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news