స్ట్రాంగ్ మార్నింగ్.. ఉదయం ఇంతకంటే గొప్పగా ఎవరు మొదలుపెడతారు..!

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ తన ఫిట్ నెస్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవరు. చేస్తున్న సినిమాల్లో హీరో క్యారక్టర్ కు తగిన దేహ దారుడ్యం చూపించాలి అంటే కష్టపడక తప్పదు. ఇక ఉదయాన్నే తన ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూ స్ట్రాంగ్ మార్నింగ్ అంటూ జిమ్ లో వర్క్ అవుట్ చేసి కాస్త అలా కూర్చున్న పిక్ ని షేర్ చేశాడు చరణ్. ఉదయాన్ని ఇంతకన్నా గొప్పగా ఎవరు స్టార్ట్ చేస్తారంటూ కామెంట్ పెట్టాడు. ఈమధ్య చరణ్ ఫిట్ నెస్ చూసి మెగా ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు.

Ram Charan Strong Morning Gym Workouts Pic

స్టార్ హీరోలు ఎక్కువగా వారి ఫిట్ నెస్ మీద దృష్టి పెడతారు. ఉదయం, సాయంత్రం జిమ్ లోనే గడిపేస్తారు. చరణ్ కూడా తన డే ని వర్క్ అవుట్స్ తోనే స్టార్ట్ చేస్తాడు. అయితే తనతో పాటు తన ఫ్యాన్స్ కూడా ఫిట్ గా ఉండాలని కోరుకునే చరణ్ ఉదయాన్ని మీరు కూడా ఇలానే మొదలు పెట్టండని చెబుతున్నట్టు ఉన్నాడు. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాలతో మూడు నెలలో రెండు భారీ సినిమాలతో మెగా ఫ్యాన్స్ ను, ప్రేక్షకులను అలరించనున్నాడు చరణ్. ఈ రెండు సినిమాల్లో కూడా చాలా స్ట్రాంగ్ క్యారక్టర్స్ లో కనిపిస్తున్నారు రాం చరణ్.

Read more RELATED
Recommended to you

Latest news