వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. వీటిని అడ్డుకోవడానికి రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగానే కష్టపడుతున్న సంగతి తెలిసిందే. వివాదాస్పదంగా మారిన ఈ బిల్లు విషయంలో కేంద్రం వెనక్కి తగ్గకపోవడంతో ఆందోళనలు కూడా ఆగే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. ఈశాన్య రాష్ట్రాలు అగ్ని గుండంలా మారాయి.
ప్రాంతీయ జాతీయ పార్టీలు అన్నీ కూడా తీవ్ర స్థాయిలో నిరసనలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీ మాజీ పోలీస్ కానిస్టేబుల్ చేసిన ఒక పని వివాదాస్పదంగా మారింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని షూట్ చేస్తున్నట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసారు. గతంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేసి రిటైర్ అయిన రాకేశ్ త్యాగీ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఒకసారి చూస్తే,
మనం కేంద్ర హోంశాఖ మంత్రి ఆదేశాలను పాటించాలని పోలీసులను కోరుతూ అంతే కాకుండా రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని పోలీసులను ఉద్దేశి౦చి మాట్లాడారు. మనపై ఎవరైనా రాళ్లు విసిరితే, వారిని షూట్ చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీయడంతో ఆ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. వీడియోని సోషల్ మీడియా నుంచి తొలగించారు.