వైసీపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.వి.రమణారెడ్డి మృతి చెందారు. కొంతకాలంగా ఎం.వి.రమణారెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో కర్నూల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే మంగళవారం పరిస్థితి విషమించడంతో రమణ రెడ్డి తుది శ్వాస విడిచారు. రమణ రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రమణ రెడ్డి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రమణారెడ్డి గొప్ప రచయిత మరియు మేధావి అంటూ కొనియాడారు. అంతేకాకుండా రమణ రెడ్డి మృతి పట్ల సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి సంతాపం ప్రకటించారు. ఇదిలా ఉంటే రమణ రెడ్డి రాయలసీమ విమోచన సమితి ని ఏర్పాటు చేశారు. రాయలసీమ హక్కుల కోసం ఆయన పోరాటం చేశారు. 1983 లో రమణారెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఎన్నో రచనలు అనువాదాలు చేసి రచయితగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.