హైదరాబాద్ కు బుల్లెట్ ట్రైన్.. ప్రతిపాదనలు తయారు చేసేపనిలో కేంద్రం

-

అన్ని సవ్యంగా జరిగితే హైదరాబాద్ నగరానికి మరో మణిహారం రాబోయే అవకాశాలు ఉన్నాయి. తాజగా హైస్పీడ్ ట్రైన్ ప్రాజెక్ట్ లో భాగంగా హైదరాబాద్- ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ రాబోయే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ కీర్తి మరింత పెరుగుతుంది. దీని కోసం కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసేపనిలో ఉంది. సాధ్యాసాధ్యాలు, భూసేకరణ వంటి అంశాలపై ద్రుష్టిపెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ – ముంబై

మధ్య 650 కిలో మీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి ప్రస్తుతం ఉన్న రైళ్లకు 14 గంటల సమయం పడుతోంది. బుల్లెట్ ట్రైన్ కల సాకారం అయితే కేవలం మూడు గంటల్లోనే ఈదూరాన్ని కవర్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియాలో అహ్మదాబాద్- ముంబై మధ్య బుల్లెట్ రైల్ పనులు జరుగుతున్నాయి. దీ

 

నితోపాటు ఢిల్లీ – అహ్మదాబాద్, ఢిల్లీ – అమ్రుత్ సర్, ఢిల్లీ- వారణాసి, చెన్నై- మైసూర్- బెంగళూర్ వంటి మార్గాల్లో కూడా బుల్లెట్ రైళ్లను తీసుకువచ్చే ప్రణాళికల్లో కేంద్రం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news