పట్టాభి పొట్టపై పిడిగుద్దులు గుద్దారు : మాజీ కేంద్రమంత్రి

పట్టాభిని పోలీసులు పొట్టపై పిడిగుద్దులు గుద్దారు…ఆ విషయం ఎవరికి తెలియదని మాజీ కేంద్ర మంత్రి, cwc సభ్యులు చింతా మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయవాడలో ఒక పెద్ద పోలీస్ అధికారి 5 కోట్లు లంచం తీసుకున్నట్లు నా వద్ద సమాచారం ఉందని ఆరోపించారు.

వంటగ్యాస్ మొదలు నిత్యావసర ధరలు పెరిగిపోయి సామాన్యులు, పేదలు అల్లాడిపోతున్నారని… యువతకు మత్తు మందులు అలవాటు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. 20 వేల కోట్ల విలువైన మత్తుమందు పట్టుకుంటే అమిత్ షా అసలు ఎందుకు మాట్లాడరు… ఏ మంత్రులు నోరువిప్పటంలేదని ప్రశ్నించారు.

రైళ్లు, విమానాలు, విమానాశ్రయాలు అమ్మేస్తున్నారని… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పరిస్థితి బాగోలేదని ఆగ్రహించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రానున్న 2024 ఎన్నికల్లో బలిజ, కాపు సామాజిక వర్గం వారిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల అనంతరం రెండు సామాజకవర్గాలను పక్కన పెట్టేస్తామన్నారు. 80 లక్షల మంది sc, st, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులకు దీపవళిలోపు ఉపకార వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.