ఈసారి రాయల్ చాలెంజర్స్ గెలుస్తుందని ఆశిస్తున్నా : డివిలియర్స్

-

మరి కాసేపట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఇక తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 8 గంటల నుంచి జరగనుంది. ఈ సందర్భంగా కామెంటేటరీ అవతారం ఎత్తిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

మాజీ ప్లేయర్ AB డివిలియర్స్ ఈసారి తమ జట్టు ట్రోఫీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నా జెర్సీ నంబర్ 17. ఇది 17వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్. కాబట్టి ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని అనుకుంటున్నా’ అని అన్నారు.ఇక చెన్నైలోని చిదంబరం స్టేడియంలో నిర్వహించిన ఓపెనింగ్ సెర్మనీ ఆకట్టుకుంది. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ షాఫ్ డాన్సులతో అల్లరించగా, ఏఆర్ రెహమాన్, సోను నిగమ్ పాటలతో ఉర్రూతలూగించారు.

Read more RELATED
Recommended to you

Latest news