ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్లో కింగ్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని సాధించాడు. టీ20ల్లో 12000 రన్స్ చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ప్రపంచంలో ఆరవ బ్యాట్స్‌మెన్‌గానూ, ఇండియా నుంచి తొలి బ్యాట్స్‌మెన్‌గానూ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. కోహ్లీ ఇప్పటివరకు 377 టీ20ల్లో విరాట్ 12వేల పరుగుల సాధించాడు.టీ20 ఇంటర్నేషనల్ , ఆర్‌సీబీ ఫ్రాంచైజీ, డొమెస్టిక్ టీ20లను కలిపి కోహ్లీ ఈ రన్స్ సాధించాడు.
టీ-20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు వీళ్లే..
క్రిస్ గేల్- 463 మ్యాచ్‌లు, 14562 రన్స్
షోయబ్ మాలిక్- 542 మ్యాచ్‌లు, 13360 రన్స్
కీరన్ పొలార్డ్- 660 మ్యాచ్‌లు, 12900 రన్స్
అలెక్స్ హేల్స్- 449 మ్యాచ్‌లు, 12319 రన్స్
డేవిడ్ వార్నర్- 370 మ్యాచ్‌లు,12065 రన్స్