ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కస్టడీ పొడిగింపు

-

లైంగిక దాడి, లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన కర్నాటక రాష్ట్రానికి చెందిన జేడీ(ఎస్) మాజీ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కస్టడీ సోమవారంతో ముగిసింది. దీంతో కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.అంటే జులై 8వ తేదీ వరకు కస్టడీని పొడిగించింది.

ఇదిలావుంటే ….ప్రజ్వల్ బెయిల్ పిటిషన్ అదనపు సిటీ సివిల్ సెషన్స్ జడ్జి ముందుకు రాగా.. ఆ ఉత్తర్వులను జూన్ 26వ తేదీకి కోర్టు రిజర్వ్ చేసింది.

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల వేళ జేడీ(ఎస్) నాయకుడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీల పెన్ డ్రైవ్ వెలుగులోకి రావడంతో కర్ణాటకలో రాజకీయ దుమారం రేగింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా జర్మనీ వెళ్లిపోయారు. ఆ క్రమంలో అతడి తాత, మాజీ ప్రధాని హెచ్ డి దేవగౌడ.. ప్రజ్వల్‌కు బహిరంగ లేఖ రాసి పోలీసుల ముందు లొంగిపోవాలని సూచించారు. ఇక మే 31న బెంగుళూరు పోలీసుల ముందు లొంగిపోయారు ప్రజ్వల్ .ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రజ్వల్‌పై జేడీ(ఎస్) పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news