మద్యం పాలసీ కేసులో ఈనెల 21 ఈడీ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీకి చెందిన సుర్జీత్ సింగ్ యాదవ్ రైతు, సామాజిక కార్యకర్తగా చెప్పుకునే ఈయన పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ ఆర్థిక కుంభకోణానికి పాల్పడిన నేపథ్యంలో పదవీలో ఉండకూడదని పేర్కొన్నారు. ఇవాళ్టితో కేజ్రీవాల్ కస్టడీ ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ కేజ్రీవాల్ ని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది ఈడీ.
ఏడు రోజుల పాటు కస్టడీ కోరింది ఈడీ. తనపై ఆరోపణలు లేకున్నా అరెస్ట్ చేశారని కేజ్రీవాల్ స్వయంగా వాదించారు. ఇరువైపు వాదనలు విన్న జడ్జీ కావేరి బవేజా తీర్పు వెల్లడించింది. ఏప్రిల్ 01 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. నాలుగు రోజుల వరకు కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. మరోవైపు జైలు నుంచి పాలన విషయంలో కేజ్రీవాల్ కి హైకోర్టులో ఊరట లభించింది. కేజ్రీవాల్ ను సీఎం పదవీ నుంచి తొలగించాలనే పిల్ ను ఇవాళ హై కోర్టు కొట్టేసింది.