ఆంధ్ర ప్రదేశ్ మంత్రి రోజాపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం షర్మిల నగరి నియోజకవర్గంలో పర్యటించారు. ఇటీవల మంత్రి రోజా వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ మీద ఉమ్మేసేవారని చెప్పిన షర్మిల.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆ పార్టీలో చేరిందంటూ వైఎస్ షర్మిలను ప్రశ్నించారు. సీఎం జగన్‌ను జైలుపాలు చేసిన పార్టీతో షర్మిల ఎలా చేతులు కలిపిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పి కాంగ్రెస్‌లో విలీనం ఎందుకు చేసిందో చెప్పాలని అన్నారు.
ఈ కామెంట్లపై నగరి వేదికగా వైఎస్ షర్మిల స్పందించారు.నగరిలో మంత్రి రోజా దోపిడీ జబర్దస్తీగా కొనసాగుతోందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ‘నగరిలో నలుగురు ఎమ్మెల్యే లు ఉన్నారు. ఇక్కడ రోజా, ఆమె భర్త, ఇద్దరు సోదరులు షాడో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తున్నారు. నగరిలో సెంటు స్థలం కూడా వారు ఖాళీగా ఉంచటం లేదు. నగరిని ఇసుక, మద్యం, గ్రావెల్ దందాలకు అడ్డాగా మార్చారు. చిన్న పనికి కూడా రోజా కుటుంబానికి కమీషన్ ఇవ్వాల్సిందే’ అని ఆమె విరుచుకుపడ్డారు.