కొడంగల్‌లో తీవ్ర ఉద్రికత్త.. బీఆర్ఎస్ నేతల అరెస్టు!

-

కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల ఏర్పాటును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనలకు దిగారు. ముందుగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేసేందుకు బయలుదేరిన గులాబీ పార్టీ నేతలను నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేసి వికారాబాద్ జిల్లా పరిగి పీఎస్‌కు తరలించారు. కొడంగల్‌లో ఫార్మా కంపెనీల ఏర్పాటును కొందరు రైతులు వ్యతిరేకిస్తున్నారని, అందుకే నియోజకవర్గంలో వాటి ఏర్పాటను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించారు.

ఈ క్రమంలోనే కోస్గి మండలం పోలేపల్లి ఎల్లమ్మ ఆలయం నుంచి దుద్యాల మండలం వరకు పాదయాత్ర నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ నేతలు నిర్ణయించారు.హైదరాబాద్ నుంచి ఈ పాదయాత్ర కోసం బయలుదేరిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తదితరులను బొమ్రాజ్ పేట మండలం తున్కిమెట్ల గ్రామం వద్ద పోలీసులు అడ్డుకుని పరిగి పీఎస్‌కు తరలించారు. మరోవైపు పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణులను కోస్గి మండల పరిధిలోని హకీంపేట వద్ద బారికేడ్లు పెట్టి నిలువరించారు. దీంతో ఆందోళనకారులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news