రాష్ట్రంలో భారీగా త‌గ్గిన ఉష్ణోగ్ర‌త‌లు

-

తెలంగాణ రాష్ట్రం లో చ‌లి వ‌ణికిస్తుంది. రోజు రోజు కు ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతున్నాయి. చ‌లి తో పాటు పోగ మంచు కూడా రావ‌డం తో ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. అలాగే ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు పోగ మంచు ఉండ‌టం తో వాహ‌న దారులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అయితే గ‌త రెండు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్ర‌త లు భారీ గా ప‌డిపోతున్నాయి.

ఆది వారం రాష్ట్రంలో అత్య‌ల్పం గా సంగారెడ్డి జిల్లా లోని కోహీర్ లో ఉష్ణోగ్ర‌త 10.9 డిగ్రీలు న‌మోదు అయింది. అలాగే ఆదిలాబాద్ లోని బే ల లో 11.5 డిగ్రీలు గా న‌మోదు అయింది. అలాగే రాష్ట్రంలో వివి ధ ప్రాంతాల‌లో కూడా క‌నీష్ట ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. దీంతో ప్ర‌జ‌లు చ‌లి తో వ‌ణికిపోతున్నారు. చ‌లి మంట లు వేసుకుంటు ప్ర‌జ‌లు చ‌లి నుంచి తత్కాలికం గా ఉప‌శ‌మ‌నం పొందుతున్నారు. అలాగే పోగ మంచు కూడా ఎక్కువ ఉండ‌టం తో ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని కూడా పోలీసులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news