ఏ ఛానెల్ అయినా.. వెబ్ సైట్ అయినా ఆదాయం అనేది కీలకం. యాడ్స్ ద్వారానే ఎక్కువగా ఆర్జించే అవకాశం ఉంటుంది. మీడియా సంస్థలకు అయితే ప్రధానం ఆదాయం యాడ్స్ ద్వారానే సమకూరుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బ్రౌజింగ్ వాణిజ్య ప్రకటనల ఆదాయాన్ని పరిశీలిస్తే మీడియా సంస్థలపై గూగుల్, ఫేస్ బుక్ పైచేయి సాధిస్తున్నాయి.
బ్రౌజింగ్ వాణిజ్య ప్రకటనల ఆదాయంలో ఫేస్ బుక్, గూగుల్ దూసుకెళ్తున్నాయి. భారత్ లో టాప్ 10 మీడియా సంస్థల ఆదాయంతో పోలిస్తే ఫేస్ బుక్, గూగుల్ ఆదాయం మూడు రెట్లు ఎక్కువగా ఉందని తేలింది.ఆన్ లైన్ మాధ్యమాల్లో వచ్చే మొత్తం డిజిటల్ యాడ్స్ లో 80 శాతం ఫేస్ బుక్ ఇండియా, గూగుల్ ఇండియాకే వెళ్తున్నాయి. 2020-21 ఏడాదిలో ఈ రెండు కలిపి రూ.23,213 కోట్లు ఆర్జించగా.. భారత్ లో టాప్ 10 మీడియాలు ప్రకటనల ద్వారా రూ.8396 కోట్లను మాత్రమే ఆర్జించడం గమనార్హం.