మళ్లీ ఫేస్‌’బుక్’.. భారీ జరిమానా?

-

యూజర్ల పర్సనల్ డేటాను వాళ్ల పర్మిషన్ లేకుండా ఫేస్‌బుక్ అమ్ముకున్నదనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే కదా. యూజర్ల డేటా లీకేజ్‌ను ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ కూడా అంగీకరించాడు. కేంబ్రిడ్జి అనాలిటికా ఇష్యూపై అమెరికన్ పార్లమెంటరీ కమిటీ ముందు కూడా ఆయన హాజరయ్యాడు.

అవును.. ఫేస్‌బుక్ మళ్లీ అడ్డంగా బుక్కయిపోయింది. ఇదివరకే కేంబ్రిడ్జి అనాలిటికా ఇష్యూలో యూజర్ల నమ్మకాన్ని కోల్పోయిన ఫేస్‌బుక్‌కు మరో షాక్ తగలబోతున్నది. అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ఎఫ్‌టీసీ) అనే సంస్థ ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా విధించబోతున్నదట. యూజర్ల డేటా గోప్యత నిబంధనల ఉల్లంఘనపైనే ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా విధించనుంది. యూజర్ల పర్సనల్ డేటాను వాళ్ల పర్మిషన్ లేకుండా ఫేస్‌బుక్ అమ్ముకున్నదనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే కదా. యూజర్ల డేటా లీకేజ్‌ను ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ కూడా అంగీకరించాడు. కేంబ్రిడ్జి అనాలిటికా ఇష్యూపై అమెరికన్ పార్లమెంటరీ కమిటీ ముందు కూడా ఆయన హాజరయ్యాడు.

సెక్యూరిటీ ఫీచర్స్ పెంచుతామని.. డెవలపర్స్‌కు యూజర్ల డేటా యాక్సెస్ ఇచ్చే సమయంలో కూడా సెక్యూరిటీ అంశాలను పెంచుతామని మార్క్ హామీ ఇచ్చాడు. అయితే.. డేటా భద్రత విషయంలో నిబంధనలను ఎలాగూ ఉల్లంఘించారు కాబట్టి.. ఫేస్‌బుక్‌కు జరిమానా మాత్రం విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇదివరకు ఎఫ్‌టీసీ.. టాప్ కంపెనీ గూగుల్‌కు 22.5 మిలియన్ డాలర్ల(సుమారు 160 కోట్ల రూపాయలు) జరిమానా విధించింది. అయితే.. ఫేస్‌బుక్‌కు విధించే జరిమానా.. అంతకంటే ఎక్కువే ఉంటుందని ఇంటర్నేషనల్ మీడియా ఊహిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news