లక్ష్మీస్ ఎన్.టి.ఆర్.. అతనెవరో తెలుసా..!

-

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ జీవిత కథతో వస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. ఎన్.టి.ఆర్ బయోపిక్ గా తాను చెప్పేదే అసలు కథ అంటూ ప్రమోట్ చేస్తున్న ఆర్జివి శుక్రవారం సాయంత్రం సినిమాలో ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. అచ్చం ఎన్.టి.ఆర్ ను పోలినట్టుగా ఉన్న అతనెవరో.. అతన్ని ఎక్కడి నుండి వర్మ తీసుకొచ్చాడో అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

అయితే అతని వివరాలు ఆర్జివినే తన ట్విట్టర్ లో వెళ్లడించడం జరిగింది. వెస్ట్ గోదావరికి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ కు కొంత కాలం ట్రైనింగ్ ఇచ్చి ఎన్.టి.ఆర్ గా అతన్ని మార్చాడట ఆర్జివి. వర్మ సినిమాల్లో కాస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. కథకు కావాల్సిన ఎమోషన్ క్యారీ చేయగల సత్తా ఉన్న నటులను ఎంపిక చేస్తాడు అయితే ఎన్.టి.ఆర్ విషయంలో పోలికలు అవసరం కావాల్సి రాగా ఎలాగోలా అతన్ని పట్టుకుని ఫస్ట్ లుక్ తో అదరగొట్టేలా చేశాడు వర్మ.

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ లో ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ గా వచ్చిన వీడియో 12 గంటల్లో 1 మిలియన్ వ్యూస్ సాధించింది. వర్మ తలచుకుంటే అన్నంత పని చేయగలడు అని మరోసారి ఎన్.టి.ఆర్ లుక్ తో ప్రూవ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news