ఆవిరి పడితే కరోనా వైరస్‌ చనిపోతుందా?

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. వివిధ రకాల మందులు వాడుతూనే ఉన్నారు ప్రజలు. అదేవిధంగా హోం రెమిడీస్‌ కూడా పాటిస్తున్నారు. ఆయర్వేదిక్‌లో భాగంగా నీటితో ఆవిరి పట్టడం వల్ల కరోనా వైరస్‌ చనిపోతుందని చాలా మంది స్టీమర్లు, పాత్రలో నీటిని వేడి చేసి ఆవిరి పట్టడం కామన్‌ అయిపోయింది. అయితే, కేవలం ఆవిరి పట్టడం వల్ల కరోనా వైరస్‌ చనిపోతుందా? గత ఏడాడి వైరస్‌ వ్యాపించినపుడు దీనిపై సోషల్‌ మీడియాలో వైరల్‌గా కూడా మారింది. చాలా మంది కూడా వైరస్‌ బారిన పడకుండా ఆవిరి పట్టుకోవడం కూడా చేశారు. అయితే, ఇప్పటి వరకు ఆవిరి పట్టడం వల్ల వైరస్‌ను ముప్పును తప్పించుకోవచ్చ అని ఇప్పటి వరకు ఎటువంటి పరిశోధనలు జరగలేదు.

కొంతమంది ఆవిరిని 15–20 నిమిషాలు లేదా మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు ఆవిరి పట్టుకోవాలని సూచిస్తున్నారు. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, సీడీసీ(సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌) రెండూ కూడా ఆవిరి పట్టుకోవడం వల్ల కరోనాకు చెక్‌ పెట్టవచ్చని సూచించలేదు. సీడీసీ అయితే కరోనా సోకిన వ్యక్తి ఆవిరి పట్టుకోవడం మరింత ప్రమాదం అని తెలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా వీటికి ఎటువంటి రుజువు లేదు, ఒక టవల్‌తో తల భాగాన్ని కవర్‌ చేసి, వేడి ఆవిరిని పీల్చుకోవడం ప్రమాదకరం అని, వేడి ద్రవాలు ముక్కులోకి వెళ్లి డెంజర్‌ అవుతుందని స్పానిష్‌ పిడియాట్రిక్‌ అసోసియేషన్‌ హెచ్చరించింది. ఇలా వేడి ఆవిరిని పీల్చుకోవడం వల్ల ముక్కు రంద్రాలు, ఊపిరితిత్తులకు గాయాలు అవుతాయని, అందుకే దీన్ని గుర్తుంచుకొని కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం, మాస్కును వాడాటం, తరచూ చేతిని సబ్బుతో కడుక్కోవాలి. చేతిని కంటి, నోరు, ముక్కు వద్ద పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.