సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం. మినిస్టరీ ఆఫ్ పవర్ పేరుతో గ్రేడ్-1 అసిస్టెంట్ ఇంజినీర్ అఫర్ లెటర్ ని పంపిస్తోందని ఓ వార్త వచ్చింది.
నిజంగా మినిస్టరీ ఆఫ్ పవర్ పేరుతో గ్రేడ్-1 అసిస్టెంట్ ఇంజినీర్ అఫర్ లెటర్ ఇస్తోందా..? ఇది నిజమేనా నమ్మచ్చా అనేది చూస్తే.. గ్రేడ్-1 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకి సంబంధించి మినిస్టరీ ఆఫ్ పవర్ ఎలాంటి అపాయింట్మెంట్ లెటర్ ని పంపడం లేదు. ఇది కేవలం ఫేక్ వార్త మాత్రమే. దీనిలో నిజం లేదు. చాలా మంది ఫేక్ వార్తలను నమ్మి అనవసరంగా మోసపోతున్నారు. కానీ ఇలాంటి ఫేక్ వార్తలకి దూరంగా ఉండాలి లేదంటే చిక్కుల్లో పడాల్సి వస్తుంది.
An appointment letter allegedly issued in the name of Ministry of Power claims that the applicant has been appointed for the post of Grade-1 Assistant Engineer. #PIBFactCheck:
▪️ This claim is #FAKE.
▪️@MinOfPower has not issued any such appointment letter. pic.twitter.com/xdAQc4v5ju
— PIB Fact Check (@PIBFactCheck) November 9, 2022