సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ వార్తలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కొందరు కావాలని పనిగట్టుకుని మరీ ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరొక ఫేక్ వార్త తెగ ప్రచారం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను ఇస్తుందంటూ ఓ వార్త వాట్సాప్‌లో షేర్ అవుతోంది. అయితే ఇందులో నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో వెల్లడైంది.
ఓ సంస్థ సహాయంతో కేంద్ర ప్రభుత్వం దేశంలోని పౌరులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు అవకాశం కల్పిస్తుందని, పౌరులు ఇంటి నుంచి పనిచేసి డబ్బు సంపాదించవచ్చని ఆ మెసేజ్‌లో ఉంది. కేవలం మొబైల్ ఫోన్ ఉంటే చాలని, రూ.300 పెట్టుబడి పెడితే రోజుకు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు సంపాదించవచ్చిన ఆ మెసేజ్ లో ఉంది.
It is being claimed in a #WhatsApp message that the Government of India in collaboration with an organisation is providing work from home opportunities.#PIBFactCheck:
▶️This claim is #FAKE
▶️No such announcement has been made by GOI
▶️Do not engage with such fraudulent links pic.twitter.com/hJ4MhMXphu— PIB Fact Check (@PIBFactCheck) August 23, 2021
అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆ మెసేజ్ అంతా అబద్దమని తేల్చింది. కేంద్రం అలాంటి స్కీమ్‌ను లేదా ఉద్యోగ అవకాశాలను ప్రారంభించలేదని నిర్దారించింది. అందువల్ల వాట్సాప్‌లో ప్రచారం అవుతున్న ఆ మెసేజ్‌ను నమ్మకూడదని, అనవసరంగా డబ్బులను కోల్పోవద్దని పీఐబీ సూచించింది. ఈ మేరకు పీఐబీ ట్వీట్ చేసింది.