చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు శరత్ కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న శరత్ కుమార్.. తన ఆరోగ్యం క్షీణించడంతో.. ఇవాళ మృతి చెందాడు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో మరణించినట్లు సమాచారం అందుతోంది. ఇక ఆయన మృతి వార్త తెలియగానే.. ఆయన కుటుంబం విషాదంలోకి వెళ్లింది.
దర్శకుడు శరత్ కు ఇంకా పెళ్లి కాలేదు. దాదాపు 20 చిత్రాలకు దర్శకత్వం వహించిన శరత్.. `డియర్` నవల ఆధారంగా `చాద స్తపు మొగుడు`తో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. బాలకృష్ణ, సుమన్ తో భారీ విజయాలు అందుకున్న శరత్.. బాలకృష్ణతో `వంశాని కొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్ధారకుడు` సినిమాలు తీశాడు. సుమన్ తో `చాదస్తపు మొగుడు, పెద్దింటి అల్లు డు, బావ-బావమరిది, చిన్నల్లుడు` సినిమాలు తెరకెక్కించాడు శరత్. కృష్ణతో `సూపర్ మొగుడు` రూపొందించాడు. ఇక శరత్ మరణానికి సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.