ఫ్యాక్ట్ చెక్: ఇంట్లో వుండే ఫ్రిడ్జ్ కారణంగా బ్లాక్ ఫంగస్ వస్తోందా..?

-

ఫ్యాక్ట్ చెక్ (Fact Check) : కరోనా కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుండడం తో కాస్త రిలీఫ్ గా ఉన్నారు ప్రజలు. ఈ మహమ్మారి మాత్రమే కాకుండా బ్లాక్ ఫంగస్ కూడా చాలా మందిని భయానికి గురి చేస్తోంది. చాలా మంది కరోనా బారిన పడి ఎన్నో ఇబ్బందులు పడ్డారు.

ఫ్యాక్ట్ చెక్ (Fact Check)

ఇదిలా ఉంటే బ్లాక్ ఫంగస్ వల్ల కూడా చాలా మందిలో టెన్షన్ పెరిగిపోయింది. స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడే వాళ్లలో డయాబెటిస్ సమస్య ఉన్న వాళ్ళలో బ్లాక్ వస్తుందని వైద్యులు కూడా చెప్పారు.

అయితే తాజాగా బ్లాక్ ఫంగస్ కి సంబంధించి ఒక పోస్ట్ నెట్టింట్లో షికార్లు కొడుతోంది. ఉల్లిపాయలు ద్వారా కూడా బ్లాక్ ఫంగస్ వస్తుందని గతంలో ఒక వార్త కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్ ద్వారా కూడా బ్లాక్ ఫంగస్ వస్తుందన్న వార్తలు నెట్టింట్లో తెగ షికార్లు కొడుతున్నాయి.

ఫ్యాక్ట్ చెక్:

ఫ్రిడ్జ్ లోపల ఉండే బ్లాక్ ఫిలిం లేదా రబ్బర్ కారణంగా బ్లాక్ ఫంగస్ వస్తుందన్న వార్తలు వచ్చాయి. దీనిలో నిజమెంత….? ఈ విషయానికి వస్తే మనం ఫ్రిడ్జ్ లో పెట్టే ఆహారం దీనికి తగిలి దీని ద్వారా మనకి ఈ బ్లాక్ ఫంగస్ వస్తుందని ఫేక్ వార్తలు వచ్చాయి.

అదే విధంగా కొందరు అయితే పండ్ల మీద కూరగాయల మీద ఉండే నల్ల మచ్చలు చూసి బ్లాక్ ఫంగస్ వస్తుందని చెప్తున్నారు. దీని గురించి హోమియోపతిక్ ఎక్స్పర్ట్ ఏమంటున్నారంటే.. పండ్ల మీద కూరగాయల మీద ఉండే నల్లటి మచ్చలు మట్టి ద్వారా వస్తాయని నల్లగా ఉండే వాటిని కడుక్కుని తినొచ్చని… కానీ బాగా కుళ్ళిపోయిన వాటిని ఉపయోగించకూడదు అని అన్నారు.

AIIMS డైరెక్టర్ అయితే ఈ బ్లాక్ ఫంగస్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ ఆధారంగా వస్తుందని… ఈ ఇన్ఫెక్షన్ బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల కూడా వస్తుందని పేషెంట్ యొక్క చర్మం క్రమంగా ఫేడ్ అయిపోతుందని ఆ తర్వాత చర్మం నల్లగా అయిపోతుందని.. దీని వల్ల బ్లాక్ ఫంగస్ అనే పేరు వచ్చిందని అన్నారు.

అలానే స్టెరాయిడ్స్ ని ఎక్కువగా తీసుకున్న లేదా డయాబెటిస్ ఎక్కువగా వున్నా ఈ సమస్య వస్తుంది. కనుక స్టెరాయిడ్స్ ని తగ్గించడం, డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచడం చేస్తే ఎటువంటి రిస్క్ ఉండదని, జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news