అలర్ట్ : ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ టైమింగ్స్ ఇవే

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. మొదట్లో 20 వేలకు పైగా కేసులు నమోదు కాగా ఇప్పుడు 10 వేలకు లోపే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ జూన్ 10 తర్వాత కర్ఫ్యూ సడలింపు సమయం పొడగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం ఏపీలో రేపట్నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చోటుచేసుకొనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు కర్ఫ్యూ నుంచి వెసులుబాటు ఉండనుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కర్ఫ్యూ కటినంగా అమలు కానుంది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.

కర్ఫ్యూ వేళల్లో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. అటు కర్ఫ్యూ సడలింపు దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై దర్శన సమయము పొడిగించారు. ప్రస్తుతం ఉదయం 06.30 గం.ల నుండి 11.30 గం.ల వరకే అనుమతి ఉండగా… రేపటి నుండి 1 గంటల వరకు దర్శనలకు అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 11.45 గం.ల నుండి 12.15 గం. ల వరకు శ్రీ అమ్మవారి మహా నైవేద్యం కొరకు వచ్చే దర్శనాలను నిలుపుదల చేసింది ఆలయ కమిటీ.