ఈ మధ్య తెగ ఫేక్ వార్తలు మనకి వినబడుతూనే ఉన్నాయి. తాజాగా ఒక వార్త వచ్చింది అందులో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం. కొన్ని నెలల్లో భారత రాష్ట్రపతి పదవీకాలం ముగిసిపోతుంది. త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. ముఖ్యంగా వాట్సప్ గ్రూపులలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.
భారత రాష్ట్రపతి అభ్యర్థిగా శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఎన్నిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత అనేదాని గురించి ఇప్పుడు చూద్దాం. వెంకయ్య నాయుడు ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన రాష్ట్రపతి పదవి లోకి రానున్నట్లు వార్త రావడంతో చాలా మంది ఎంతో ఉత్సాహంతో షేర్ చేశారు.
2017 జులై 25 వ తేదీన రామ్ నాధ్ కోవింద్ భారత 14వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే దీనిని బట్టి చూస్తే రాష్ట్రపతి పదవీకాలం ముగియడానికి ఇంకా నాలుగు నెలలు ఉంది. ఎన్నికలు మొదలవడానికి కూడా మూడు నెలల సమయం ఉంది. వెంకయ్యనాయుడు 2017 ఆగస్టు 11వ తేదీన బాధ్యతలని తీసుకున్నారు ఈ లెక్కన చూస్తే మరో ఐదు నెలల సమయం ఉంది.
అయితే ఇంక ఈ వార్త లో నిజం ఏమిటి అనేది చూస్తే.. భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఎంపిక చేశారని వచ్చిన వార్తలో నిజం ఏమీ లేదు. నిజానికి ఇది ఫేక్ వార్త మాత్రమే. ఇలాంటి ఫేక్ వార్తలని అనవసరంగా నమ్మద్దు. షేర్ చెయ్యద్దు.