ఫ్యాక్ట్ చెక్: ఏటీఎం నుండి నాలుగు సార్లు డబ్బులు తీస్తే..173 రూపాయలు కట్ అయ్యిపోతాయా..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.

ఏటీఎం డబ్బులు విత్ డ్రా కి సంబంధించి కొన్ని రూల్స్ వచ్చాయని.. అయితే ఏటీఎంలో నుండి డబ్బులు తీసుకునే వాళ్ళు ఈ రూల్స్ ని చూడాలని ఒక వార్త వచ్చింది. ఒకవేళ కనుక ఏటీఎంలో పరిమితికి మించి డబ్బు విత్ డ్రా చేసుకుంటే… చార్జీలు కట్ అయిపోతాయి అని అందులో ఉంది అయితే ఇంతకీ ఇది నిజమా కాదా..? దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

చాలామంది ఏటీఎంలో ప్రతిరోజు డబ్బులు డ్రా చేస్తూ ఉంటారు. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసినప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఇప్పటి నుంచి ఏటీఎం ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకునే వాళ్ళు నాలుగు సార్లు కంటే ఎక్కువ సార్లు విత్ డ్రా చేసుకుంటే అమౌంట్ కట్ అయిపోతుంది.

నాలుగు సార్లు కంటే ఎక్కువ సార్లు తీస్తే 150 రూపాయలు ట్యాక్స్ తో కలిపి మొత్తం 173 రూపాయలు కట్ అవుతాయని ఈ వార్తలో ఉంది. అయితే ఇది నిజమా కాదా అనేది చూస్తే… ఇది ఫేక్ వార్త అని తెలుస్తోంది. ఏటీఎం నుండి ఐదు సార్లు డబ్బులు చేసుకోవచ్చు. తర్వాత ఒక ట్రాన్సాక్షన్ కి 21 రూపాయలు మాత్రమే కట్ అవుతాయి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించి వచ్చిన వార్త ఫేక్ అని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news