అరుణాచలేశ్వర స్వామి దేవాలయం విశేషాలు ..!

-

మన భారత దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా ఎన్నో విశిష్ట దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి అరుణాచలేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం తమిళనాడులోని విల్లిపురంకు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామలై లో ఉన్న తేజో లింగ స్వరూపుడిగా దర్శనమిస్తున్న దేవాది దేవుడు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం అనే కొండను ఆనుకుని ఉన్నందున ఈ క్షేత్రానికి అరుణాచలంగాను, ఈ స్వామికి అరుణాచలేస్వరుడు గా పేరు వచ్చింది.

వెయ్యి స్తంభాల మండపం, రెండు వందల అడుగుల ఎత్తైన పదకొండు అంతస్తుల గోపురంతో ఎంతో గంభీరంగా ఉంటుంది. ఈ ఆలయానికి నాలుగు వైపులా గోపురాలు ఉంటాయి. వీటిలో ఒక దానిని శ్రీ కృష్ణ దేవరాయలు 1560 వ సంవత్సరంలో నిర్మించినట్లు చరిత్ర చెపుతుంది.పంచ భూత స్థలాల్లో తిరువన్నామలై ఒకటి. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే కార్తిక మాసంలో పది రోజుల పాటు జరిగే దీపోత్సవం.

ఇక్కడ పదకొండు అంతస్తుల్లో వెలిగించే దీపాలను చూడటానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. ఆ దీపాల కాంతిలో అరుణాచలేస్వరుడు శోభాయమానంగా విరాజిల్లుతాడు. ఇక్కడ మరో విశేషం వెయ్యి కిలోల నెయ్యితో, ఒక కిలోమీటర్ పొడవు ఉన్న ఒత్తితో వెలిగించే అఖండ దీపం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ అఖండ జ్యోతి పదకొండు రోజుల పాటు వెలుగుతూనే ఉంటుంది. ఈ దివ్య జ్యోతినే అరుణాచలేస్వరుడుగా భావించి చేసే గిరి ప్రదిక్షణ చేయటం ముఖ్యమైన విషయం.

Read more RELATED
Recommended to you

Latest news