కేసీఆర్ ధీమా ఏంటి…?

-

వచ్చే నెల 7 తర్వాత తెలంగాణాలో కరోనా ఉండే అవకాశం లేదు… కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణా ఉంటుంది అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు క్వారంటైన్ లో ఉన్న 25 వేల మంది బయటకు వచ్చేస్తారని, వారిలో ఇప్పటికే చాలా మంది బయటకు వస్తున్నారని వారిలో ఎవరికి కరోనా వైరస్ లేదని ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసారు.

రాష్ట్రంలో కరోనాతో బాధపడుతున్న వాళ్ళు కూడా కోలుకుంటున్నారు అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ బారిన పడిన వాళ్ళల్లో 11 మంది కోలుకున్నారని, మిగిలిన వారికి కూడా కరోనా తగ్గుతుందని, రాష్ట్రంలో కరోనా సోకే అవకాశం లేదని, అన్ని జిల్లాల సరిహద్దులను కూడా మూసి వేశామని, రాష్ట్రాల సరిహద్దులను కఠినం గా మూసి వేశామని ఆయన ధీమాగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణకు ఇబ్బంది లేదని అంటున్నారు.

అయితే విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో కెసిఆర్ సర్కార్ ఇప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. వాళ్ళు అందరికి కూడా జియో ట్యాగ్ పెట్టారని వాళ్ళు ఎవరూ కూడా బయటకు వచ్చే అవకాశం లేదని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పుడు ఉన్న 70 కరోనా కేసులు కూడా తగ్గిపోతున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులను పూర్తిగా మూసి వేసింది తెలంగాణా.

దీనితోనే కెసిఆర్ ధీమాగా ఉన్నారని అంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరికి కూడా ఇప్పటికే వైద్య పరిక్షలు పూర్తి చేసారని అంటునారు. అందుకే కెసిఆర్ అంత ధీమాగా ఉన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారులు ఎక్కడిక్కడ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళను పర్యవేక్షిస్తూ వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అందుకే కెసిఆర్ అంత పక్కాగా తేదీ తో సహా చెప్పారని, ఆయన వ్యాఖ్యల తర్వాత తెలంగాణా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news