హైదరాబాద్ లో నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ముట్ట గుట్టురట్టు అయ్యింది. డిగ్రీ, డిప్లొమా ఫెక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న గ్యాంగ్ సభ్యులు అరెస్ట్ అయ్యారు. వివిధ యూనివర్సిటీ ల పేర్లతో సర్టిఫికెట్స్ తయారు చేస్తుంది గ్యాంగ్. ఈ ఫెక్ సర్టిఫికెట్స్ తో విదేశాలకు సైతం కొందరు వెళ్లినట్లు గుర్తించారు. ఫిల్మ్ నగర్ పీఎస్ పరిధిలో ఈ ఫెక్ సరిఫికెట్స్ గ్యాంగ్ అరెస్ట్ అయింది.
ఈ అరెస్టులపై టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర మాట్లాడుతూ.. నగరంలో ఫేక్ సర్టిఫికెట్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నాము. ఫేక్ సర్టిఫికెట్ ముఠాలో మొత్తం 8మంది ఉన్నారు. అందులో ఇద్దరు యూపీ కి చెందిన వారు ఉన్నారు. వాళ్ళ దగ్గర వివిధ యూనివర్సిటీలకు చెందిన ఉన్న సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకున్నాము. పోలీసులు నిఘా ఉందని సిటీ వదిలి వెళ్ళడానికి గ్యాంగ్ ప్లాన్ చేసింది. అందుకే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వీరు కలిశారు.. ఈ గ్యాంగ్ లో కింగ్ పిన్ వజహత్ అలీ ఇతనిపై గతంలో 4కేసుకు ఉన్నాయి ఇతని స్వస్థలం నిజామాబాద్. జాబ్ లేకుండా ఉన్న వారు, మ్యారేజ్ కానీ వారు టార్గెట్ గా ఈ సర్టిఫికెట్స్ దందా చేస్తున్నారు అని డీసీపీ సుధీంద్ర పేర్కొన్నారు.