మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలకు హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని పేర్కొన్నారు. శాస్త్రీయ పద్దతిలో కులగణన చేయలేదని.. అబాస్ పాలయిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీల పట్ల కాంగ్రెస్ కి చిత్త శుద్ది లేదని.. ఎంపీ ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ 317 జీవోతో ఉద్యోగులకు మోసం చేశాడని పేర్కొన్నారు.
సీపీఎస్ రద్దు విషయంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ పై ప్రజలకు విరక్తి రాలేదు.. కానీ 9 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై విరక్తి వచ్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం.. ఎవ్వరూ గెలిచినా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి బుద్ది చెప్పాలన్నారు. కులగణన పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు.