బీసీల పట్ల కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు : ఈటల

-

మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్ కీలక కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలకు హామీ ఇచ్చింది. కానీ ఆ హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యింది. శాస్త్రీయ పద్దతి లో కులగణన చేయలేదు. అందువల్ల అబాసు పాలు అయింది.

బీసీల పట్ల కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు. 317 జీవోతో ఉద్యోగులకు మోసం చేశాడు కేసీఆర్. CPS రద్దు విషయం లో కాంగ్రెస్ విఫలం అయ్యింది. 9 ఏండ్లలో కేసీఆర్ పై ప్రజలకు విరక్తి రాలేదు. కానీ 9 నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం పై విరక్తి వచ్చింది. బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల కు దూరం..ఎవ్వరు గెలిచిన కాంగ్రెస్ పార్టీ లోకి వస్తారు అని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. టీచర్ల సమస్యల పై పోరాటం చేసే పార్టీ బీజేపీ. ఈ దేశం సుభిక్షంగా.. సురక్షితంగా ఉండాలంటే, ప్రప్రంచం లో దేశం ముందు ఉండాలి అంటే బీజేపీ కి ఓటు వేయండి అని ఎంపీ ఈటల అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news