ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలకు వైద్య సదుపాయాలు అందించడానికి ఎంతో మంది డాక్టర్లు వారి కుటుంబాలను వదిలి రోజుల తరబడి హాస్పిటల్ లోనే ఉంటూ కరోనా సోకిన పేషెంట్స్ కు సేవలను అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది డాక్టర్లు ప్రాణాలు వదిలారు కూడా. ఓవైపు ఇలా ఉంటే మరో వైపు నకిలీ డాక్టర్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ లో ఫ్యామిలీ హెల్త్ కేర్ సెంటర్ నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
అబ్దుల్ మజీద్, సాహెబ్ అనే ఇద్దరు ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత కొన్ని రోజులకి నకిలీ డిగ్రీ పత్రాలతో డాక్టర్స్ అవతారమెత్తారు. అయితే డాక్టర్ గా పేరు ప్రఖ్యాతులతో పాటు డబ్బులు కూడా సంపాదించుకుందామని కేటుగాళ్లు ప్లాన్ చేశారు. అయితే వీరి విషయాన్ని ఓ వ్యక్తి సమాచారం అందించడంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి జరిపి వారిని అరెస్ట్ చేశారు. 2017 నుండి వారిద్దరు సమీర్ ఆస్పత్రి పేరుతో ఆసిఫ్ నగర్ లో చికిత్సలు అందిస్తున్నారు .