అంతర్జాతీయంగా పాక్‌కు మరో ఎదురుదెబ్బ..వచ్చే ఏడాది వరకూ..

-

అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది..ఉద్రవాద నిరోధక కార్యక్రమాలపై కఠినంగా అమలు చేస్తున్నామని ప్రకటించుకుంటున్నప్పటికి..ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలను పర్యవేక్షించే ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) పాకిస్థాన్‌ ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది…ఇంకా అది ఉగ్రవాదులకు సాయం చేస్తుందని షాకింగ్ విషయాలు వెల్లడించింది..ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం 27 పాయింట్ల యాక్షన్‌ ప్లాన్‌ను పూర్తిగా సాధించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన 21 అంశాల్లో పాక్‌ కొంత పురోగతి సాధించినట్లు గుర్తించింది..మిగతా 6 పాయింట్ల యాక్షన్‌ ప్లాన్‌ను 2021 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని..అప్పటి వరకు గ్రే లిస్ట్‌లోనే కొనసాగిస్తామని ఎఫ్‌ఏటీఎఫ్‌ పేర్కొంది.
పాకిస్తాన్‌లో ఇప్పటకే వేరువేరు రాజకీయపార్టీలు ఒకే వేదికపైకి వచ్చి ఇమ్రాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తున్న తరుణంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ తీసుకున్న నిర్ణయంతో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం మరింత సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోంటుందని పరిశీలకులు భావిస్తున్నారు..ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాక్‌..గ్రే లిస్ట్ నుంచి బయటపడేందుకు పాకిస్థాన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు..గ్రే లిస్టులోనే కొనసాగనుండటంతో అభివృద్ధి కోసం నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులను పాకిస్థాన్‌ ఎదుర్కోనున్నది. ఒకవైపు ఇమ్రాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశంలోని విపక్షాలు మరింత ఒత్తిడి పెంచవచ్చని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news