తెలంగాణాలో 100 మంది పోలీసుల పరువు తీసిన బ్యాచ్.. అమ్మో !

-

తెలంగాణా పోలీసుల పేరుతో నకిలీ ఫేస్ బుక్ ప్రొఫైల్ స్ క్రియేట్ చేస్తున్న ముఠాల గుట్టు రట్టు చేశారు నల్లగొండ పోలీసులు. రాజస్తాన్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. తెలంగాణా పోలీసు అధికారుల పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్న ముఠా, ఆ అకౌంట్ ల ఆధారంగా జనాల నుండి డబ్బులు అడుగుతోంది ముఠా. ఏకంగా నల్లగొండ ఎస్ పి రంగనాథ్ తో పాటు మరి కొంత మంది అధికారులు ప్రొఫైల్ లు క్రియేట్ చేసింది ఈ ముఠా.

ఈ ముఠాకి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నల్లగొండ పోలీసులు, దేశ వ్యాప్తంగా 230 మంది పోలీసుల ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసినట్టు గుర్తించారు. ఒక్క తెలంగాణలోనే 100 మంది పోలీసుల అకౌంట్స్ ఫేక్ గా క్రియేట్ చేసి డబ్బు వసూలు చేసినట్టు గుర్తించారు.

ఈ గ్యాంగ్ లో 10 మంది పైగా నిందితులు ఉన్నట్లు గుర్తించారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒక్కో నిందితుడి నుండి 100 కు పైగా సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ డిజి నుండి కానిస్టేబుల్స్ వరకు ఫేక్ అకౌంట్స్ తో ఈ ముఠా హడలెత్తించింది. నిందితుల్లో మైనర్ లే ఎక్కువని 8, 9 తరగతులు మాత్రమే ముఠా సభ్యులు చదువుకున్నారని తెలుస్తోంది.

తెలంగాణ, ఏపి, తమిళ్ నాడు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఒడ్డిశా రాష్ట్రంలోని పోలీస్ ప్రొఫైల్స్ ను వాడుకుని నిందితులు మోసాలకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. మీ పేరు కూడా ఉంది కాబట్టి మీరే ఈ కేస్ మానిటరింగ్ చేయాలనీ నల్గొండ ఎస్పి రంగనాథ్ కి డీజీపీ నుండి వచ్చిన ఆదేశాలతో ఆయన ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర పోలీసులకు దొరకకుండా తిరిగిన వీళ్ళు మొదటిసారిగా నల్గొండ పోలీసులకు ఆధారాలతో సహా చిక్కడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news