మరీ దిగజారిపోతున్న ఆర్.ఆర్.ఆర్… కొత్త కామెంట్ ఇది!

-

ఒక్కసారి దిగజారడం మొదలుపెడితే… ఆ బండి ఇంక ఆగదు.. అద్థఃపాతాళానికి పోయేవరకూ ఆ దిగజారుడు కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది.. దానికి లిమిట్ అంటూ ఉండదు అని అంటుంటారు! ఈ విషయంలో “వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ” ఎంపీ రఘురామకృష్ణంరాజు… జగన్ ని, తనకు సీటిచ్చి ఎంపీని చేసిన పార్టీని ఇరుకునపెట్టాలనే తాపత్రయంలో తనకు తాను ఎంత దిగజారిపోతుంది గ్రహించలేకపోతున్నాడు! ఇందుకు తాజా కామెంట్లు ఉదాహారణ!

భీమవరం ప్రాంతంలో ఆర్.ఆర్.ఆర్. కు ఒకప్పుడు కులమతాలకు అతీతంగా గౌరవం ఉండేది! అది రాను రానూ తగ్గుముఖం పట్టింది! అది కాస్త ముందు కులాలవారీగా, మతాలవారీగా తగ్గుముఖం పట్టగా… ఇప్పుడు పేదవాడి విషయంలో కూడా తగ్గుముఖం పట్టింది! దిగజారడం మొదలుపెట్టిన తర్వాత దానికి ఒక లిమిట్ ఉండదన్న విషయం తన రచ్చబండ రచ్చతో చెప్పుకొస్తున్నారు ఆర్.ఆర్.ఆర్.! తాజాగా “ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య”పై నీచమైన వ్యాఖ్యలు చేశారు ఆర్.ఆర్.ఆర్.!

పేదవాడి పిల్లలు కూడా ఇంగ్లిష్ మీడియం విద్యను అభ్యసించాలని, కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల రేపటి పౌరుల జీవితాలు నిరాసలో కూరుకుపోకూడదని ఆలోచించిన జగన్… పేదవాడి పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాలని ఆలోచించిన సంగతి తెలిసిందే! ఇంగ్లిష్ బాషపై పట్టులేకపోవడం అనే కారణం… ఆ రేపటి పౌరుల జీవితాల్లో సమస్య కాకూడదనేది జగన్ ఆలోచన! అయితే… అది కూడా మత పార్పిడుల కోసమే అనే నీచమైన ఆలోచన చేస్తున్నారు ఆర్.ఆర్.ఆర్.!

అవును… రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తున్న తీరు చూస్తుంటే.. ఇదంతా మతవ్యాప్తిలో అంతర్భాగంగానే జరుగుతున్నట్లు అనిపిస్తోందని చెప్పుకొచ్చారు రఘురామకృష్ణం రాజు! దీంతో… జగన్ ను ఇరకాటంలో పెట్టాలని, వైకాపాను ఇబ్బందిపెట్టాలని తాను చేసే పనులతో, మాట్లాడే మాటలతో.. ఆర్.ఆర్.ఆర్. జనాల్లో మరింత దిగజారిపోతున్నారని, పేదవాడి విషయంలో, పేదోడి పిల్లల విషయంలో మరింత ఇరుకునపడిపోతున్నారని అంటున్నారు విశ్లేషకులు!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news