నకిలీ విజయ్ దేవరకొండ ఎలా అరెస్టు అయ్యాడు…

-

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ….ఈ సినిమాతో విజయ్ అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ క్రేజే ఇప్పుడు విజయ్ కు అనేక తలనెప్పులు తెచ్చిపెడుతోంది. ఇటీవలే ఓ రోమియో విజయ్ లా గొంతు మార్చి యువతులను మోసం చేసాడు.  విజయ్ దేవరకొండనంటూ తన ఫోన్ నెంబర్ యూట్యూబ్ లో పెట్టడంతో పెద్ద ఎత్తున అమ్మాయిలు ఇతని వలలో పడ్డారు….

ఈ విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ సిబ్బంది అతనిపై సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇవ్వడంతో ఈ విషయం బయటకు తెలిసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎంతో చాకచక్యంగా వలపన్ని అతణ్ణి అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం సాయిక్రిష్టగా పోలీసులు అతడిని గుర్తించారు.

అమ్మాయిలను మోసం చేయడానికి సాయిక్రిష్ట టెక్నాలజీని బాగా వాడుకున్నాడు. విజయ్ దేవరకొండలా గొంతు మార్చి యూట్యూబ్ లో వీడియోలను పోస్ట్ చేయడంతో పాటు ఫోన్ నంబర్ ను కూడా ఉంచడంతో అమ్మాయిలు ఇతని వలలో ఇట్టే పడిపోయేవారు. దీంతో పోలీసులు కూడా సాయిని పట్టుకోవడానికి అదే టెక్నాలజీని వాడారు. ఓ అమ్మాయిలా అతడితో చాట్ చేయించారు. దీంతో ఇది నిజం అనుకుని నమ్మిన సాయిక్రిష్ట “ఈ రోజు డేట్ చేద్దాం, రేపు పెళ్ళి చేసుకుందాం అని చెప్పి” హైదరాబాద్ ఎల్బీనగర్ చేరుకున్నాడు. ప్లాన్ పక్కాగా అమలు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇప్పటికైనా యువత అన్ లైన్ మోసాల్లో చిక్కుకోవద్దని పోలీసులు సూచించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news