ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. TET స్కామే కారణం!

-

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్కామ్ ఓ కుటుంబం ప్రాణం తీసింది. ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన బెంగాల్​లోని దుర్గాపుర్​సో చోటుచేసుకుంది. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి, మరో ఆరేళ్ల బాలుడు ఉన్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.  మృతులను అమిత్ కుమార్ మొండల్ (35), రూపా మొండల్ (31).. దంపతుల పిల్లలు నిమిత్ కుమార్ మొండల్ (6), నిఖితా మొండల్​(ఏడాదిన్నర వయసు)గా పోలీసులు గుర్తించారు. అమిత్​ మృతదేహం సీలింగ్​ ఫ్యాన్​కు వేలాడుతూ ఉంది. రూపా, ఆమె ఇద్దరి పిల్లలు మృతదేహాలు కింద పడి ఉన్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మృతుల మొబైల్​లో ఓ సూసైడ్​ నోట్ పోలీసులకు​ లభ్యమైంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కుంభకోణంలో భాగమైనవారే తమ మృతికి కారణమన్నట్లు అందులో​ ఓ మెసేజ్​​ ఉంది. స్థానికులు మాత్రం ఇది అత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనని ఆరోపిస్తున్నారు. వారి కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఆ విషయంలోనే వీరిని హత్య చేశారని ఉంటారని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version