రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త.. క‌రోనా తో మృతి చెందిన జ‌ర్న‌లిస్ట్ కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌లు

-

గ‌త ఏడాది వ‌చ్చిన క‌రోనా మ‌హమ్మారి తో ల‌క్ష‌ల ప్ర‌జలు చ‌నిపోయారు. అలాగే క‌రోనా ఉధృతిని నిత్యం తెలుసుకుని ప్ర‌జ‌లు వివ‌రించిన జ‌ర్న‌లిస్టు లు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కి క‌రోనా వైర‌స్ సోకి మ‌ర‌ణించారు. కాగ క‌రోనా తో మ‌ర‌ణించిన జ‌ర్న‌లిస్టు కుటుంబాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్థిక సాయం చేయాల‌నే డిమాండ్ పెరిగింది. దీంతో తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

క‌రోనా వైర‌స్ బారిన ప‌డి చ‌నిపోయిన జ‌ర్న‌లిస్టు లు అంద‌రికీ రూ. 2 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని రాష్ట్ర మీడియా అకాడ‌మీ చైర్మెన్ అల్లం నారాయ‌ణ తెలిపారు. అంతే కాకుండా ఈ నెల 15 న క‌రోనా తో మృతి చెందిన మొత్తం 63 కుటుంబాల‌కు చెక్కుల‌ను కూడా పంపిణీ చేయ‌నున్నట్టు కూడా ప్ర‌క‌టించారు. అంతే కాకుండా ఈ ఏడాది లో మార్చి నుంచి డిసెంబ‌ర్ వ‌రకు ఇత‌ర కార‌ణాల‌తో చ‌నిపోయిన 34 కుటుంబాల‌కు కూడా రూ. ల‌క్ష సాయం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Latest news