‘ఫ్యామిలీ స్టార్’ అలా కాక ఇంకేం అవుతుంది: నటి ఆశా

-

విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్ కాంబినేషన్లో వచ్చిన మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమా ఏప్రిల్ 5న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పరశురామ్ పెట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.ఇదిలా ఉంటే…’ఫ్యామిలీ స్టార్’ మూవీపై నటి ఆశా బొర్రా ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

మూవీలో తనను వాడుకుని వదిలేశారని.. ఒక్క సీన్ కూడా తాను కనిపించలేదని.. ఇక ఆ మూవీ UTTER FLO.. కాకపోతే ఇంకేం అవుతుందని ఆమె రాసుకొచ్చారు. ‘ఆ పాత్ర నేనే చేయాలంటూ అందరూ ఫోన్లు చేసి హంగామా చేశారు. నా టైమ్ వేస్ట్ చేశారు అని అసహనం వ్యక్తం చేశారు. నా పనులన్నీ మానుకుని షూటింగ్లో పాల్గొన్నా అని పేర్కొన్నారు. రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. నా కళ్లు తెరిపించారు’ అని ఆమె మండిపడ్డారు. కాగా, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాని నిర్మించారు.గోపీ సుందర్ మ్యూజిక్ అందించాడు.మొదటి రోజు ఈ చిత్రం కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా 8-8.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా ఉండే అవకాశం కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news