విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమా ఏప్రిల్ 5న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పరశురామ్ పెట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీపై నెగటివ్ టాక్ ప్రభావం ఉండడంతో కలెక్షన్ల పరంగా డిజాస్టర్ మూట కట్టుకున్నట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే… ఫ్యామిలీ స్టార్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఖరారైనట్లు తెలుస్తోంది. మే 3 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.. మరి థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేక పోయిన ఈ మూవీ ఓటీటీలో ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.