‘ఆర్ఆర్ఆర్’లో తారక్‌ను చూసి కంటతడి పెట్టిన యువతి.. వీడియో వైరల్..

-

మాస్టర్ స్టోరి టెల్లర్ ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ గ్రాండియర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి జనం ఫిదా అయిపోతున్నారు. ఈ పిక్చర్‌కు కలెక్షన్స్ వర్షం కురుస్తున్నది. ఈ చిత్రం ప్రధానంగా భావోద్వేగాలపైనే కేంద్రీకృతమై ఉండగా, హీరోలు రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి జనం కంట తడి పెడుతుండటం విశేషం. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్‌లో రామ్ చరణ్‌ను తారక్ కొడుతుండటం చూసి ఓ బుడ్డోడు కంట తడి పెట్టుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా, తాజాగా ఓ యువతి తారక్ యాక్టింగ్ చూసి ఏడ్చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ప్లే అవుతుండగా తారక్ ఎమోషనల్ సీన్స్‌లో పర్ఫార్మెన్స్ చూసి ఏడ్చేసింది. ఈ క్రమంలోనే దానిని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది నెట్టింట తెగ వైరలవుతోంది. మొత్తంగా దర్శకధీరుడు రాజమౌళి కథనం నడిపించడంలో దర్శకుడిగా తనను మించినవాడు లేడు అనే విషయాన్ని మాటల్లో కంటే చేతల్లోనే చూపిస్తున్నాడని సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ ను కలిపి సినిమా తీసి మల్టీ స్టారర్ ట్రెండ్ కు కూడా రాజమౌళియే శ్రీకారం చుట్టాడని చెప్పొచ్చు. పాన్ ఇండియా ఫిల్మ్స్ ఒరవడి రాజమౌళి తీసిన ‘బాహుబలి’తో స్టార్ట్ కాగా, ఇప్పుడు మల్టీస్టారర్ ట్రెండ్ కూడా కొనసాగుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి రాజమౌళి ఫాదర్ విజయేందప్రసాద్ స్టోరి అందించగా, ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇక ఈ చిత్రంలో సముద్రఖని, అజయ్ దేవగణ్, శ్రియా సరణ్, ఆలియా భట్ రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version