చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ రిలీజ్‌.. అభిమానుల రియాక్షన్ ఇదే!

-

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధానపాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’. మోహన్‌రాజా దర్శకుడు. విజయ దశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. చిరంజీవి కటౌట్లకు అభిమానులు పూజలు చేస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా సిద్ధమైన ఈసినిమాలో చిరు పెర్ఫార్మెన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

సినిమాలో చిరు ఎంట్రీ సీన్స్‌, డైలాగ్‌లు, స్టైల్‌.. ఇలా ప్రతీది వింటేజ్‌ చిరంజీవి గుర్తు తెచ్చేలా ఉన్నాయంటూ ఫ్యాన్స్‌ ట్వీట్స్‌ చేస్తున్నారు. ‘Boss Is Back’ అంటూ చిరు నటించిన పలు చిత్రాల్లోని పవర్‌ఫుల్‌ మేనరిజం సీన్స్‌ను ట్విటర్‌ వేదికగా చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ‘గాడ్‌ ఫాదర్‌’పై అభిమానుల రియాక్షన్‌ ఎలా ఉందో తెలియజేసేలా ఇప్పుడు ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ‘జెర్సీ’ సినిమాలో నాని.. రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పైకి వెళ్లి గట్టిగా అరుస్తూ తనలోని ఉద్వేగాన్ని బయటపెడతాడు. అనంతరం ఆయన ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే, ప్రస్తుతం తమ రియాక్షన్‌ కూడా సేమ్‌ టు సేమ్‌ అలాగే ఉందని మెగా అభిమానులు ఆ వీడియోను షేర్‌ చేస్తున్నారు.

చాలారోజుల తర్వాత చిరంజీవిని ఇలాంటి పవర్‌ఫుల్‌ రోల్‌లో చూడటం ఎమోషనల్‌గా ఉందని వాళ్లు పేర్కొంటున్నారు. మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకొన్న ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా ‘గాడ్‌ ఫాదర్‌’ వచ్చింది. సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలకపాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు.

Read more RELATED
Recommended to you

Latest news