ఆకాశంలో అద్భుత దృశ్యం

-

హైదరాబాద్: ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. సూర్యుడి చుట్టూ ఇంద్ర ధనస్సులా వలయం ఏర్పడింది. సుమారు గంట పాటు ఈ దృశ్యం ప్రజలను అబ్బురపరిచింది. ఆకాశంలో నిర్మలంగా ఉండటంతో వలయం చాలా స్పష్టంగా కనిపించింది. దీంతో తమ మొబైల్ ఫోన్లలో ఈ వలయాలను బంధించి మురిసిపోయారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఈ వలయాకార దృశ్యాలు కనిపించాయి. సూర్యూడి చుట్టూ మేఘాలు ఏర్పడినప్పుడు కూడా ఇలాంటి వలయం ఏర్పడుతుంది. దీని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ సమయంలో విష కిరణాలు వెలువడవని అని స్పష్టం చేస్తున్నారు.

సైంటిఫిక్ పరిభాషలో ఈ వలయాలను “22-డిగ్రీ హలోస్” అని పిలుస్తారని తెలిపారు. అయితే ఈ వలయాన్ని డైరెక్ట్‌గా పదే పదే చూడకూడదని, కంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఒక ప్రాంతంలో ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి కనిపిస్తుందని, అన్ని ప్రాంతాల్లో ఈ వలయం కనిపించదని తెలిపారు. గత వారంలో ఇలాంటి దృశ్యం బెంగళూరులో దర్శనమిచ్చింది. అప్పట్లో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news