శబరిమలకు వెళ్లే భక్తులు ఎక్కువగా అద్దె బస్సులకు ప్రాధాన్యత ఇస్తూంటారు. అందు కోసం తెలంగాణ ఆర్టీసీ కూడా అనుమతి ఇస్తుంది. అలాగే తాజాగా శబరిమలకు కు వెళ్లె అద్దె బస్సుల ఛార్జీల గురించి ప్రకటించింది. ఈ ఏడాది శబరి మలకు నడుపుతున్న బస్సులకు ఛార్జీలు తక్కువ గా తీసుకుంటామని టీఎస్ ఆర్టీసీ తెలిపింది. అలాగే ఛార్జీల వివరాలను కూడా ప్రకటించింది. ప్రస్తుతం అద్దె బస్సుల ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి.
36 సీట్లు ఉన్న సూపర్ లగ్జరీ బస్సు కు ప్రతి కిలో మీటర్ కు రూ. 48.96 చొప్పున అద్దే ఉంటుందని టీస్ ఆర్టీసీ తెలిపింది. అలాగే 40 సీట్లు ఉన్న డీలక్స్ బస్సు కు ప్రతి కిలో మీటర్ కు రూ. 47.20 ఉంటుందని తెలిపింది. దీంతో పాటు 48 సీట్లు ఉన్న డీలక్స్ బస్సు కు ప్రతి కిలో మీటర్ కు రూ.56.64 చొప్పున ఉంటుందని వివరించింది. అలాగే 49 సీట్లు ఉన్న ఎక్స్ ప్రెస్ బస్సుకు ప్రతి కిలో మీటర్ కు రూ. 52.43 చొప్పున అద్దె ఉంటుందని టీఎస్ ఆర్టీసీ తెలిపింది. అయితే అద్దె బస్సులు కావాలను కున్నావారు దగ్గర్లో ఉన్న ఆర్టీసీ డిపోలో సంప్రదించాలని తెలిపారు.