రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. రైతుల సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లును శీతాకాల సమావేశాల మొదటి రోజు (నవంబర్ 29న) పార్లమెంటులో ప్రవేశపెడుతున్నట్లు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ సింగ్ తోమర్ వెల్లడించారు. ప్రత్యామ్నాయ పంటలు, పంటల వైవిధ్యీకరణ, కనీస మద్దతు ధర, జీరో బడ్జెట్ వ్యవసాయం పై ప్రధాన మంత్రి మోదీ ఓ కమిటీని ఏర్పాటు చేస్తునట్లు వెల్లడించారు. ఈ కమిటీలో రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారని మంత్రి వెల్లడించారు. దీని ద్వారా రైతుల మద్దతు ధర హామీ కూడా నెరవేరుతుందన్నారు.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని నిర్ణయం తీసుకున్నాము.. త్వరలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లును కూడా తీసుకువస్తున్నామని.. అయినా రైతుల నిరసనల్లో అర్థం లేదని నరేంద్ర తోమర్ అన్నారు. రైతులు ఇకనైనా నిరసనలు ఆపేసి ఇళ్లకు వెళ్లాలని కోరారు.