సాగు చట్టాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నేను అలా అనలేదని అంటున్నారు. ఇటీవల నాగ్ పూర్ లో జరిగిన ఓ వ్యవసాయ కార్యక్రమంలో సాగు చట్టాలపై పూర్తిగా వెనక్కి వెళ్లలేదని… త్వరలో మార్పులతో మళ్లీ వ్యవసాయ చట్టాలను తీసుకువస్తామని అన్నారు. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వ రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని.. ప్రధాన మోదీ మాత్రమే రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు.
అయితే ఈవ్యాఖ్యలపై కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. బీజేపీ కేవలం 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే మూడు సాగు చట్టాలను రద్దు చేసిందని… తర్వాత తీసుకు వచ్చే అవకాశం ఉందని… రానున్న ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ అంటుంది.
అయితే తాజాగా కేంద్రమంత్రి ఆయన వ్యాఖ్యలపై స్పందించారు. కేంద్రం మళ్లీ సాగు చట్టాలను తెచ్చేందుకు సిద్ధమవుతోందని తానెప్పుడూ అనలేదని తోమర్ అన్నారు.