ప్రధాని క్షమాపణలు కోరుకోవడం లేదు: రాకేశ్ తికాయత్

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి రైతులు క్షమాపణ కోరడం లేదని, విదేశాల్లో ఆయన ప్రతిష్టను దిగజార్చడం తమకు ఇష్టం లేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. దాదాపు ఏడాది కాలం పాటు రైతు సంఘాలు ఆందోళన నేపథ్యంలో మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో రైతులు ఇళ్లకు వెళ్లారు. ఈ నేపథ్యంలో రాకేశ్ తికాయత్ మాట్లాడారు.

ప్రధాన మంత్రి నుంచి మేం క్షమాపణలు కోరడం లేదు. విదేశాల్లో ఆయన ప్రతిష్టను దిగజార్చడం మాకు ఇష్టం లేదు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే రైతు అనుమతి లేకుండా సాధ్యం కాదు. మేం నిజాయితీగా పొలాల్లో సాగు చేస్తున్నాం. కానీ, కేంద్ర ప్రభుత్వం మా డిమాండ్లను పట్టించుకోలేదు అని రాకేశ్ తికాయత్ పేర్కొన్నారు.

రద్దు చేసి మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాటలను రాకేశ్ తికాయత్ తప్పు పట్టాడు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు రైతులను మోసం చేసేలా, ప్రధాన మంత్రిని కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news